వరుడికి ఫొటోలు పంపి పెళ్లి ఆపేసిన ప్రియుడు

ABN , First Publish Date - 2021-01-21T00:26:17+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రియుడు చేసిన నిర్వాకంతో ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. అనపర్తి మండలం

వరుడికి ఫొటోలు పంపి పెళ్లి ఆపేసిన ప్రియుడు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రియుడు చేసిన నిర్వాకంతో ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. అనపర్తి మండలం మహేంద్రవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికుమార్తెతో దిగిన ఫొటోలను పెళ్లికొడుకుకు ప్రియుడి పంపించాడు. ఫొటోలు చూసిన వరుడు.. వధువును పెళ్లిచేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లికుమార్తె బంధువులు ఆగ్రహంతో ప్రియుడ్ని పట్టుకుని అనపర్తి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-21T00:26:17+05:30 IST