కోవిడ్ పాజిటివ్ వచ్చినా విధుల్లోనే ఆలయ ఈవో

ABN , First Publish Date - 2021-07-12T22:35:37+05:30 IST

కానీ ఈయన మాత్రం ఈవో క్వార్టర్లో ఉన్న తన పర్సనల్ ఛాంబర్ వద్దకే ఆలయ ఉద్యోగులను పిలపిస్తున్నారు. ఇలాగే జరిగితే మరి కొందరు ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల దేవస్థానం

కోవిడ్ పాజిటివ్ వచ్చినా విధుల్లోనే ఆలయ ఈవో

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఈవో జి.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ అని ఆదివారం నిర్ధారణ అయింది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ ఆయన విధుల్లోనే కొనసాగుతుండడం కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై ఆయన వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఇంకా రిపోర్టు రాలేదని బుకాయిస్తున్నారు.  సెలవు పెట్టి హోమ్ ఐసోలేషన్ ఉండవలసిన ఈవో ప్రస్తుతం తన పర్సనల్ ఛాంబర్లో విధులు నిర్వహిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది చేత కొన్ని ఫైళ్లను తేప్పించుకొని సంతకాలు చేస్తున్నారు. ఈవో ప్రవర్తనపై సిబ్బంది అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తి 14 రోజుల పాటు పూర్తిగా ఎవరినీ కలవకుండా హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ ఈయన మాత్రం ఈవో క్వార్టర్లో ఉన్న తన పర్సనల్ ఛాంబర్ వద్దకే ఆలయ ఉద్యోగులను పిలపిస్తున్నారు. ఇలాగే జరిగితే మరి కొందరు ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-07-12T22:35:37+05:30 IST