డ్రగ్స్ వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలి: నక్కా ఆనంద్‌బాబు
ABN , First Publish Date - 2021-10-21T21:34:53+05:30 IST
డ్రగ్స్ వ్యవహారంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. సీఎం జగన్‌రెడ్డి టీడీపీ నేతల భాషపై మాట్లాడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు తప్పుబట్టారు.

అమరావతి: డ్రగ్స్ వ్యవహారంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. సీఎం జగన్‌రెడ్డి టీడీపీ నేతల భాషపై మాట్లాడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు తప్పుబట్టారు. పట్టాభి భాష అభ్యంతరకరమని జగన్‌రెడ్డి అంటున్నారని, మరి గతంలో చంద్రబాబుపై జగన్‌రెడ్డి వ్యాఖ్యలకు ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును ఇష్టానుసారం దూషించారని గుర్తుచేశారు. జగన్‌రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల భాష తప్పులా కనిపించలేదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం సమాధానం చెప్పాలని నక్కా ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.