రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిగ్గుతేల్చండి

ABN , First Publish Date - 2021-10-20T08:52:07+05:30 IST

రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా విషయమై నిజాలు నిగ్గు తేల్చాలని కొరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం

రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిగ్గుతేల్చండి

  • డీజీపీకి వర్ల రామయ్య లేఖ


విజయవాడ(పాయకాపురం), అక్టోబరు 19: రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా విషయమై నిజాలు నిగ్గు తేల్చాలని కొరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మంగళవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా వేళ్లూనుకుంటోందని మీడియాలో ప్రచారం జరుగుతోందని, దీనికి తగిన ఆధారాలు కనిపిస్తున్నాయని, వీటిపై పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పాత్రధారులను.. పోలీసు యంత్రాంగం దాచిపెడుతోందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీకి 18 ప్రశ్నలు సంధించారు. 

Updated Date - 2021-10-20T08:52:07+05:30 IST