బీఈఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డా.పార్థసారథి నియామకం

ABN , First Publish Date - 2021-12-31T18:26:19+05:30 IST

అమరావతి: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ పార్థసారథిని నియామకం

బీఈఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డా.పార్థసారథి నియామకం

అమరావతి: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ పార్థసారథిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చాలో పనిచేస్తున్నారు. దేశ రక్షణ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పార్థసారధి అన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలో అత్యంత నిబద్ధతతో పని చేస్తానని, భారత దేశీయ రక్షణరంగ ఉత్పత్తులను తయారు చేయడంలో తాను కూడా భాగస్వామి అవుతానన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ పార్థసారథి స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-31T18:26:19+05:30 IST