బాలుడి వైద్యానికి ముందుకొచ్చిన దాతలు

ABN , First Publish Date - 2021-12-31T08:48:07+05:30 IST

బాలుడి వైద్యానికి ముందుకొచ్చిన దాతలు

బాలుడి వైద్యానికి ముందుకొచ్చిన దాతలు

కొండాపురం, డిసెంబరు 30: ‘మా బిడ్డను కాపాడండి’ అనే శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అనూహ్య స్పందన లభించింది. కడప జిల్లా కొండాపురానికి చెందిన రెడ్డెప్ప అనే 8 ఏళ్ల బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కూలీలైన చిన్నారి తల్లిదండ్రులు బాలుడి చికిత్స కోసం డబ్బులేక ఇబ్బంది పడుతున్న వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. గురువారం ఉదయం నుంచి విశాఖపట్టణం, తూర్పుగోదావరి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి తమకు ఫోన్‌ చేసి సమస్య తెలుసుకుని రూ.70 వేలు పంపారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మండల వైసీపీ కన్వీనర్‌ నిరంజన్‌రెడ్డి ఫోన్‌ చేసి సమస్యను ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, బాలుడికి అన్ని విధాలా సహాయం చేసేలా చూస్తామని తెలిపారని వివరించారు. తమ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-12-31T08:48:07+05:30 IST