‘వ్యాక్సిన్‌ పేరుతో జీతం కోత వద్దు’

ABN , First Publish Date - 2021-05-05T09:02:39+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ పేరుతో విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఒక రోజు జీతం కత్తిరించే ఆదేశాలను నిలుపుచేయాలని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్‌ చేశారు

‘వ్యాక్సిన్‌ పేరుతో జీతం కోత వద్దు’

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ పేరుతో విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఒక రోజు జీతం కత్తిరించే ఆదేశాలను నిలుపుచేయాలని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఉద్యోగులను అభినందించాల్సింది పోయి, జీతాల్లో కోత పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన సంఘాల నాయకులకు మెమోలు కూడా జారీ చేశారని తెలిపారు.

Updated Date - 2021-05-05T09:02:39+05:30 IST