పోలీసులపై నమ్మకం లేదు

ABN , First Publish Date - 2021-10-21T10:02:37+05:30 IST

‘పోలీసులపై నమ్మకం పోయింది. మా రక్షణ మేమే చూసుకుంటాం’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.

పోలీసులపై నమ్మకం లేదు

మా రక్షణ మేమే చూసుకుంటాం: బుద్దా వెంకన్న

విజయవాడ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ‘పోలీసులపై నమ్మకం పోయింది. మా రక్షణ మేమే చూసుకుంటాం’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు పిలుపు మేరకు బుధవారం బంద్‌లో పాల్గొనేందుకు విజయవాడలోని తన ఇంటిని నుంచి బయటకు వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. డీజీపీ, వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పని చేస్తున్నారంటూ విమర్శించారు. ‘‘మాకు మేమే రక్షణగా నిలబడి వైసీపీ రౌడీ మూకలను అడ్డుకుంటాం. దాడికి ప్రతి దాడే సమాధానమని మేమూ నిర్ణయించుకున్నాం. చంద్రబాబు గాంధీ సిద్ధాంతాల వల్ల వైసీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు’’ అని బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2021-10-21T10:02:37+05:30 IST