చంద్రబాబు వ్యాఖ్యలపై దివ్యవాణి వివరణ
ABN , First Publish Date - 2021-01-20T21:13:30+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై క్రైస్తవులు కలవరపడాల్సిన పనిలేదని ఆ పార్టీ నేత దివ్యవాణి చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై క్రైస్తవులు కలవరపడాల్సిన పనిలేదని ఆ పార్టీ నేత దివ్యవాణి చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ మతాన్ని తక్కువగా చూడకూడదనే చంద్రబాబు చెప్పారని, మతోన్మాదంతో పనిచేస్తున్నది ఎవరో.. మతసామరస్యం కోసం నిలిచేది ఎవరో.. ప్రజలు గ్రహించాల్సిన సమయం వచ్చిందని దివ్యవాణి వివరణ ఇచ్చారు.
ఇటీవల క్రైస్తవులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్రిస్టియన్ సెల్‌లో పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు వై.ప్రవీణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఈనెల 5న క్రైస్తవ సమాజాన్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు విస్తుపోయారన్నారు. క్రైస్తవం మతం కాదు...ఒక మార్గం మాత్రమే అని, ఎవరు ఏది కోరుకుంటారో వారు దానిని ఆచరిస్తారని అన్నారు. దానిని మత మార్పిడి అని ఎలా అంటారని ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వానికి, జిల్లాల అధ్యక్ష పదవులకు పలువురు రాజీనామా చేశారు.