‘దిశ’తో మహిళలకు భరోసా: సుచరిత

ABN , First Publish Date - 2021-11-23T09:49:18+05:30 IST

మహిళల భద్రతకు దిశ యాప్‌ భరోసా ఇస్తుందని హోంమంత్రి సుచరిత అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో

‘దిశ’తో మహిళలకు భరోసా: సుచరిత

మహిళల భద్రతకు దిశ యాప్‌ భరోసా ఇస్తుందని హోంమంత్రి సుచరిత అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో దిశ యాప్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలో 621 మందిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసులు నమోదు చేయగా, 98 రేప్‌ కేసులు చార్జిషీట్‌ వేశామన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సచివాలయాల్లో 14,194 మంది మహిళా పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2021-11-23T09:49:18+05:30 IST