ముందొచ్చిన వారికే రాయితీ

ABN , First Publish Date - 2021-12-19T08:13:02+05:30 IST

ముందొచ్చిన వారికే రాయితీ

ముందొచ్చిన వారికే రాయితీ

ఆర్బీకేల్లో సగం ధరకే పురుగు మందుల పంపిణీ

కేంద్రం నుంచి నిధులు పరిమితమే

అమరావతి, డిసెబరు 18(ఆంధ్రజ్యోతి): ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌... ముందు వచ్చిన వారికే రాయితీపై పురుగు మందులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద కేంద్ర ప్రయోజిత పథకంగా వ్యవసాయదారులకు సగం ధరకే పురుగు మందుల పంపిణీ అమలవుతోంది. రైతుకు ఇస్తున్న 50 శాతం రాయితీలో 60ు కేంద్రం, 40ు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. మిగతా సగం ధరను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు పరిమితంగా ఉండటంతో ఏపీ సర్కార్‌ ఈ పథకాన్ని ముందు వచ్చిన వారికే అమలు చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన పంటలకు, ఎంచుకున్న జిల్లాలకే ఈ సబ్సిడీని పరిమితం చేసింది. రూ.21.56 కోట్ల సబ్సిడీతో రబీలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ఆగ్రోస్‌ 52 పురుగు మందుల కంపెనీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. గతంలో ఏవోల ద్వారా మండలాల్లో పంపిణీ చేసే ఈ రాయితీ పురుగు మందులను ఈసారి ఆర్బీకేల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలాదిమంది రైతులు ఆయా ఎంపిక చేసిన పంటలను పండిస్తుంటే కేవలం వందల్లో మాత్రమే పురుగు మందు సబ్సిడీకి ఇస్తామని చెప్పడం సరికాదని, దీని కంటే విపత్తులకు నష్టపోయిన రైతులకు ఇలాంటి పథకాలను వర్తింప చేస్తే... బాధిత రైతులకు కొంతైనా ప్రయోజనం కలుగుతుందని పలువురు వ్యాఖ్యాస్తున్నారు.

Updated Date - 2021-12-19T08:13:02+05:30 IST