డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలి
ABN , First Publish Date - 2021-10-29T09:28:27+05:30 IST
డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలి
లారీ యజమానుల సంఘం డిమాండ్
తాడేపల్లిగూడెం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పెరిగిన డీజిల్, పెట్రోలు ధరలను తగ్గించాలని, వీటిని జీఎ్‌సటీలో చేర్చాలని తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు లారీ యజమానులు, వర్కర్లు గురువారం ఇక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై భారీగా రోడ్డు పన్నులు విధిస్తూనే మళ్లీ టోల్ టాక్స్ ఎలా వసూలు చేస్తారని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురుజు సూరిబాబు ప్రశ్నించారు. రోడ్డు పన్ను వసూలు చేసినా రహదారులు వేయడం లేదని, దెబ్బతిన్న రోడ్ల కారణంగా డీజిల్ ఖర్చు అధికమవుతోందని , లారీల నిర్వహణ భారం భారీగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం పది రెట్లు పెంచడంవల్ల రవాణా రంగం పూర్తిగా దెబ్బతిందని తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అధ్యక్షుడు జానకి రాము చెప్పారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎ్‌సటీలో చేర్చాలని డిమాండ్ చేశారు.