జగన్‌పై వ్యాఖ్యలు చేస్తే ఆగ్రహం తప్పదు: ధర్మాన
ABN , First Publish Date - 2021-10-21T19:45:52+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పట్టాభి సీఎంపై వాడిన భాషను చంద్రబాబు సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు.
శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పట్టాభి సీఎంపై వాడిన భాషను చంద్రబాబు సమర్ధిస్తున్నారా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, క్షమాపణలు చెప్పించాలన్నారు. అధికారం కోల్పోయి 2 ఏళ్ళు కాకముందే టీడీపీ తీవ్ర అసహనానికి గురవుతోందన్నారు. ఉచ్చరించలేని భాషను పట్టాభి సీఎంపై ప్రయోగించారన్నారు. కోట్లాది మంది అభిమానులున్న జగన్‌పై వ్యాఖ్యలు చేస్తే ఆగ్రహం తప్పదన్నారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణానికి టీడీపీ కారణమన్నారు.