వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డీజీపీ పని చేస్తున్నారు: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-10-20T14:24:28+05:30 IST

టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పోలీసులపై నమ్మకం పోవడంతో తమ రక్షణ తామే చూసుకుంటామని

వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డీజీపీ పని చేస్తున్నారు: బుద్దా వెంకన్న

అమరావతి: టీడీపీ నేత బుద్దా వెంకన్న నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పోలీసులపై నమ్మకం పోవడంతో తమ రక్షణ తామే చూసుకుంటామని బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డీజీపీ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంకా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ‘‘నిజాయితీ గల అధికారులు కూడా డీజీపీ వల్ల ఉద్యోగాలు చేయలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పోలీసు వ్యవస్థకు ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు మాకు పోలీసుల పై నమ్మకం లేదు. మాకు మేమే రక్షణగా నిలబడి.. వైసీపీ రౌడీ మూకలను అడ్డుకుని తీరతాం. దాడికి దాడే సమాధానం అని మేము కూడా నిర్ణయించుకున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డీజీపీకి స్పందించాల్సిన బాధ్యత లేదా? సీఎం జగన్మోహన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ  నెలకొంది. దృష్టి మళ్లించడానికే ఈ వరుస దాడులు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T14:24:28+05:30 IST