దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ సవాంగ్‌

ABN , First Publish Date - 2021-10-14T09:09:22+05:30 IST

దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ సవాంగ్‌

దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ సవాంగ్‌

విజయవాడ(చిట్టినగర్‌), అక్టోబరు 13: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను బుధవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దర్శించుకున్నారు. పూజల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు శాంతిభద్రతలు చేకూర్చడంలో తనకు మరింత శక్తి, ధైర్యం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్టు తెలిపారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. రాష్ట్ర ప్రజలు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు పోలీ్‌సశాఖ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2021-10-14T09:09:22+05:30 IST