క్యూలైన్‌లో వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్న దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-10-07T19:50:18+05:30 IST

ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మను సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

క్యూలైన్‌లో వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్న దేవినేని ఉమ

విజయవాడ : ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మను సర్వదర్శనం క్యూలైన్‌లో వెళ్లి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యూలైన్‌లో గ్రావెల్ సరిగా వేయలేదన్నారు. క్యూలైన్‌లో బైండింగ్ వైర్లు అలాగే ఉన్నాయన్నారు. పారిశుధ్యం ఇంకా పెంచాలని.. ఎన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయో మీడియా ద్వారా తెలపాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అమ్మవారి ప్రాంగణంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుడు సతీష్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ప్రతీ మూల నక్షత్రం నాడు సీఎం నిధులు కేటాయించామని చెపుతారని.. ఆ నిధులు ఎంత మేర ఖర్చు చేసారో తెలపాలన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నానని దేవినేని ఉమ తెలిపారు.

Updated Date - 2021-10-07T19:50:18+05:30 IST