ప్రధానికి రాసిన లేఖల్లో బలం లేదు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-07-08T09:09:28+05:30 IST

‘‘పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏర్పడిన జల వివాదంపై ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రి రాసిన లేఖల్లో బలం లేదు. రాష్ట్ర హక్కులకు సంబంధించి కీలకమైన అంశాలను ఈ లేఖలో వివరించడంలో సీఎం విఫలమయ్యారు

ప్రధానికి రాసిన లేఖల్లో బలం లేదు: దేవినేని ఉమా

‘‘పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఏర్పడిన జల వివాదంపై ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రి రాసిన లేఖల్లో బలం లేదు. రాష్ట్ర హక్కులకు సంబంధించి కీలకమైన అంశాలను ఈ లేఖలో వివరించడంలో సీఎం విఫలమయ్యారు. ఆయన చేతగానితనం ఈ లేఖల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోతే కేంద్రం ఆర్థికపరమైన శిక్షను విధించే అవకాశం ఉందన్నారు. ఆ సెక్షన్‌ను పీఎంకు ఎందుకు గుర్తు చేయలేదని ప్రశ్నించారు.

Updated Date - 2021-07-08T09:09:28+05:30 IST