బఫూన్‌, సన్నాసి, బూతుల మంత్రులు ఉన్నారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-01-21T00:14:56+05:30 IST

రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. సజ్జల కనుసన్నల్లో జగన్‌, డీజీపీ పరిపాలన చేస్తున్నారు.

బఫూన్‌, సన్నాసి, బూతుల మంత్రులు ఉన్నారు: దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. సజ్జల కనుసన్నల్లో జగన్‌, డీజీపీ పరిపాలన చేస్తున్నారు..దుర్మార్గపు పరిపాలన ఎక్కువ కాలం నడవద్దన్నారు. కోత ముక్కల ఆటలో గుంత బంకిని తీసుకునే మంత్రులు తమ మీద దాడులు చేస్తామంటారా? అని ప్రశ్నించారు. బిహార్‌లో కూడా ఇంత దుర్మార్గపు పాలన లేదన్నారు. పక్క రాష్ట్ర సీఎంతో లాలూచీ పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్లకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ అరాచక పాలన చేస్తుందన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వారికి ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వైసీపీలో బఫూన్‌, సన్నాసి, బూతుల మంత్రులున్నారని చెప్పారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఢిల్లీ పర్యటన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-21T00:14:56+05:30 IST