అశోక్‌ గురించి మాట్లాడే అర్హత ఏ-2 విజయసాయికి లేదు: అయ్యన్న

ABN , First Publish Date - 2021-12-25T08:24:23+05:30 IST

విజయనగరం సంస్థానానికి చెందిన అశోక్‌గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-2 విజయసాయిరెడ్డికి లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.

అశోక్‌ గురించి మాట్లాడే అర్హత ఏ-2 విజయసాయికి లేదు: అయ్యన్న

నర్సీపట్నం, డిసెంబరు 24: విజయనగరం సంస్థానానికి చెందిన అశోక్‌గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-2 విజయసాయిరెడ్డికి లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. వందలాది ఎకరాలు దోచుకున్న దొంగ అని అశోక్‌ గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన కాలిగోటికి విజయసాయిరెడ్డి సరిపోడన్నారు. రాజకీయాల్లోకి రాకముందు విజయవాడ దుర్గగుడి వద్ద కొబ్బరి చిప్పలు అమ్ముకున్న దేవదాయ శాఖ మంత్రి కూడా అశోక్‌ గురించి మాట్లాడుతున్నారని ఆయ్యన్న మండిపడ్డారు. 

Updated Date - 2021-12-25T08:24:23+05:30 IST