కుళ్లిపోతున్న మృతదేహాలు

ABN , First Publish Date - 2021-05-08T08:59:09+05:30 IST

కరోనా విలయానికి ఆస్పత్రుల్లో భీతావాహ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల శవాగారం మృతదేహాలతో నిండిపోయింది

కుళ్లిపోతున్న మృతదేహాలు

తెనాలి రూరల్‌ మే 7: కరోనా విలయానికి ఆస్పత్రుల్లో భీతావాహ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల శవాగారం మృతదేహాలతో నిండిపోయింది. దీంతో వస్తున్న మృతదేహాలను బయటే వదిలేస్తున్నారు. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో శవాలు కుళ్లిపోయి దుర్ఘంధం వెదజల్లుతున్నాయి. మార్చురీ లోపల ఉన్న ఫ్రీజర్లలో 4మృతదేహాలు మాత్రమే నిల్వచేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం కరోనా విలయంతో మార్చురీ నిండిపోయిం ది. ఫ్రీజర్లలో నాలుగు మృతదేహాలుండగా కింద రెండు శవాలను పెట్టి తాళాలు వేశారు. కొత్తగా వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి ఆవరణలోనే వదిలేశారు. మార్చురీ ఆవరణ ప్రాంతం మొత్తం వాడేసిన పీపీఈ కిట్లు, రక్తపు మరకలతో భయానక వాతావరణం నెలకొంది. రోజుల తరబడి మృతదేహాలు నిల్వ ఉండటంతో మార్చురీ సమీపంలోకి వెళ్లేందుకు సిబ్బందిగానీ, మృతుల బంధువులు గానీ సాహసం చేయలేకపోతున్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా మరణాలు పెరిగిపోతున్న తరుణంలో కనీసం మృతదేహాల నిర్వహణ కూడా సరిగా లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-05-08T08:59:09+05:30 IST