శ్రీవారి సేవలో ములబాగల్ పాదరాజ మఠాధిపతి
ABN , First Publish Date - 2021-03-21T09:29:12+05:30 IST
శ్రీవారి సేవలో ములబాగల్ పాదరాజ మఠాధిపతి

తిరుమల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ములబాగల్ పాదరాజ మఠాధిపతి కేశవనిధి తీర్థస్వామి శనివారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.