ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

ABN , First Publish Date - 2021-10-21T10:09:03+05:30 IST

ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

దాడులకు టీడీపీ భయపడదు: ధూళిపాళ్ల నరేంద్ర

పొన్నూరుటౌన్‌, అక్టోబరు 20: ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. టీడీపీ బంద్‌ సందర్భంగా బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. విడుదలైన అనంతరం విలేకర్ల సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు వచ్చాయన్నారు. టీడీపీ కార్యాలయంలో పట్టుబడిన సక్రునాయక్‌ పోలీసు అయితే, టీడీపీ కార్యాలయ పైఅంతస్థులో అతనికి ఏం పని అని ప్రశ్నించారు.   

Updated Date - 2021-10-21T10:09:03+05:30 IST