ఎంపీ ‘గోరంట్ల’ నుంచి ప్రాణహాని!

ABN , First Publish Date - 2021-12-09T08:57:30+05:30 IST

‘‘హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నన్ను హత్య చేస్తానని బెదిరించారు’’

ఎంపీ ‘గోరంట్ల’ నుంచి ప్రాణహాని!

   ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్య 

న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నన్ను హత్య చేస్తానని బెదిరించారు’’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘‘నేను బుధవారం ఉదయం 10.40 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిటీ సమావేశం పూర్తి చేసుకుని తిరిగి పార్లమెంటు ఆవరణలోని గేట్‌ నంబర్‌-4 నుంచి ప్రవేశిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మాధవ్‌ నన్ను చూసి, ‘ఒరేయ్‌.. నిన్ను మర్డర్‌ చేసి దెం...’ అని బెదిరించారు. అప్పుడు నేను కూ డా ‘ట్రై చేసుకో’మని చెప్పా’’ అని రఘురామ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాధవ్‌ గత చరిత్ర చూస్తే, ఆయన తన భార్యను కూడా హత్య చేసినట్లు సోషల్‌ మీడియాలో ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ‘‘సీఎం జగన్‌ అండ, ప్రోత్సాహంతోనే వైసీపీ ఎంపీలు నన్ను దూషిస్తున్నారు. మర్డర్‌ చేస్తామని పార్లమెంటు సాక్షిగా పదేపదే భయపెడుతున్నారు’’ అన్నారు.  


Updated Date - 2021-12-09T08:57:30+05:30 IST