వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నా: పురంధేశ్వరి
ABN , First Publish Date - 2021-10-20T21:38:37+05:30 IST
వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నానని బీజేపీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శలను

అమరావతి: వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నానని బీజేపీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ఉండాలన్నారు. విమర్శలకు దాడులు జవాబు కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో గొంతులను అణచివేయలేరని పురంధేశ్వరి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్‌పై దాడిని ఖండిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు.