రైతు పరిహారానికి కోత!
ABN , First Publish Date - 2021-05-21T10:26:53+05:30 IST
వ్యవసాయం చేస్తూ ప్రమాదాలకు గురయ్యే, సాగు ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్యలు చేసుకొనే రైతుల కుటుంబాలను ఆదుకొనేందుకు ఉద్దేశించిన బడ్జెట్ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం బాగా కుదించింది

గతేడాదితో పోల్చితే తగ్గిన బడ్జెట్
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం చేస్తూ ప్రమాదాలకు గురయ్యే, సాగు ఒత్తిళ్ల వల్ల ఆత్మహత్యలు చేసుకొనే రైతుల కుటుంబాలను ఆదుకొనేందుకు ఉద్దేశించిన బడ్జెట్ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం బాగా కుదించింది. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పరిహారం కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించగా, తాజా బడ్జెట్‌లో రూ.20 కోట్లే కేటాయించారు. గతేడాది 1.58 లక్షల మంది కౌలు రైతులకు రూ.213.47కోట్లు పెట్టుబడి సాయం అందించగా, ఈ ఏడాది కౌలు రైతుల సంఖ్య పెరిగిందో లేదో బడ్జెట్‌లో స్పష్టత లేదు. అలాగే, రైతు భరోసా పథకం కేటాయింపులకు గత ఏడాదితో పోల్చితే భారీ కోత పెట్టారు. ఈ మేరకు రూ.11,891.20 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీకి మంత్రి కన్నబాబు సమర్పించారు. మార్కెట్ యార్డులను నవీకరించేందుకు రూ.200కోట్లను ప్రతిపాదించారు. రైతుభరోసా కేంద్రాల్లో పంట కొనుగోలు చేసేలా ఈ-మార్కెటింగ్ విధానాన్ని ఈ సీజన్ నుంచి అమలులోకి తీసుకువస్తామన్నారు. ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3వేల కోట్లు ప్రతిపాదించారు. రైతుభరోసా కేంద్రాల్లో మౌలిక వసతుల కోసం రూ.100కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 160 వైఎస్సార్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.