‘ఏపీడీఆర్పీ’ పనులు పూర్తి చేయండి: సీఎస్
ABN , First Publish Date - 2021-03-24T10:06:00+05:30 IST
‘ఏపీడీఆర్పీ’ పనులు పూర్తి చేయండి: సీఎస్

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ కింద రూ.1,777.38 కోట్లతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రపంచబ్యాంక్, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి వర్చువల్‌గా ఏపీడీఆర్పీ ప్రాజెక్ట్‌పై ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు, కార్యనిర్వాహక ఏజెన్సీలతో ఆయన సమీక్షించారు.