ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-10-19T08:33:37+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలి: రామకృష్ణ

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్వ సంపదను అదానీకి, ఆయన కంపెనీలకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.  రైల్‌ రోకోలో పాల్గొన్న రైతు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలను అరెస్టులు చేయడాన్ని రామకృష్ణ ఖండించారు. 

Updated Date - 2021-10-19T08:33:37+05:30 IST