మోదీ... ఏపీకి ఏదీ రాజధాని: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-07-08T23:29:47+05:30 IST
ఏపీకి ఏది రాజధానో చెప్పలేని పరిస్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అమరావతి: ఏపీకి ఏది రాజధానో చెప్పలేని పరిస్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, అమరావతి రాజధాని అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని రామకృష్ణ ఖండించారు. విశాఖ ఉక్కు అనుబంధ సంస్థలను సైతం 100శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటం దుర్మార్గమని రామకృష్ణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ త్వరలో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు.