మీడియాపై రాజద్రోహమా?

ABN , First Publish Date - 2021-05-20T08:44:15+05:30 IST

ఎప్పుడో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాల ఆధారంగా రాజకీయ కోణంతో ప్రతీకార చర్యల కోసం మీడియా యాజమాన్యాలపై రాజద్రోహం కేసులు పెట్టడం సబబు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మీడియాపై  రాజద్రోహమా?

ఇది రాజ్యాంగ ధ్వంసం: నారాయణ


పుత్తూరు, మే 19: ఎప్పుడో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాల ఆధారంగా రాజకీయ కోణంతో ప్రతీకార చర్యల కోసం మీడియా యాజమాన్యాలపై రాజద్రోహం కేసులు పెట్టడం సబబు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రఘురామరాజుతోపాటు టీవీ 5, ఏబీఎన్‌ యాజమాన్యాలపై ప్రభుత్వం రాజద్రోహం కేసులు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే ప్రక్రియలో భాగమేనని విమర్శించారు. యాక్ట్‌ 124 ఇప్పుడు చెల్లుబాటు కాదని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని వామపక్షాలు పోరాడుతున్నాయని, ప్రస్తుతం అది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. గుర్రానికి కుక్క మెడకాయ పెట్టినట్లు 124 సెక్షన్‌ బలంగా ఉన్నప్పటికీ దానికింద నమోదు చేస్తున్న కేసుల్లో సబ్జెక్ట్‌ వీక్‌గా ఉండడంతో కేసులు చెల్లుబాటు కావడంలేదని తెలిపారు.

Updated Date - 2021-05-20T08:44:15+05:30 IST