కరోనా వ్యాక్సిన్‌పై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-01-12T22:55:15+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ను దేశంలోని...

కరోనా వ్యాక్సిన్‌పై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్

విజయవాడకు చేరుకున్న ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్

విజయవాడ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ను దేశంలోని పలు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ చేరుకుంది. పుణె కేంద్రంగా తయారైన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ను విజయవాడకు బాక్సుల్లో భద్రపరచి తరలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకావడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అప్పటి వరకూ వ్యాక్సిన్‌ను శీతల పరిస్థితుల్లో నిల్వ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ హైదరాబాద్‌కు కూడా చేరుకుంది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్‌తో బయలుదేరిన విమానం శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్‌‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ బాక్సులను కోఠిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలించారు.


శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో వ్యాక్సిన్‌ను తరలించనున్నారు. దీని కోసం వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్‌లను అధికారులు వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు.

Updated Date - 2021-01-12T22:55:15+05:30 IST