హమ్మయ్య.. ఒకే ఒక మరణం!
ABN , First Publish Date - 2021-10-29T09:01:33+05:30 IST
హమ్మయ్య.. ఒకే ఒక మరణం!
కొత్తగా 381 కరోనా కేసులు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా రోజూ నాలుగైదు మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఒక్క మరణం మాత్రమే నమోదవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం!. బుధవారం 38,896 మందికి పరీక్షలు నిర్వహించగా 381 మంది కొవిడ్ బారినపడ్డారని, ఒకరు మృతి చెందారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. చిత్తూరులో 82, తూర్పు గోదావరిలో 57, కృష్ణా 61, విశాఖపట్నం 43, పశ్చిమ గోదావరి 21, గుంటూరు 47 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,65,235 మంది కరోనా బారినపడ్డారు. అందులో 20,46,127 మంది కోలుకున్నారు. బుధవారం కరోనాతో కృష్ణాజిల్లాల్లో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,365కు చేరింది. ప్రస్తుతం 4743 యాక్టివ్ కేసులు ఉన్నాయి.