ఏడాదిన్నర బిడ్డతో సహా దంపతులు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-13T08:34:54+05:30 IST

అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి భార్య, ఏడాదిన్నర కొడుకుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏడాదిన్నర బిడ్డతో సహా దంపతులు ఆత్మహత్య

పాలకోడేరు, జనవరి 12: అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి భార్య, ఏడాదిన్నర కొడుకుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే... భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో పరశురామ్‌(46),  ధనసావిత్రి (35) దంపతులు వెంకటశ్రీనివాస్‌ (ఏడాదిన్నర)తో నివసిస్తున్నారు.  అధిక వడ్డీలకు ఆశపడి అత్తిలి గ్రామానికి చెందిన హైమావతి అనే మహిళకు వీరివద్ద ఉన్న నగదుతోపాటు వేరే వ్యక్తుల వద్దనుంచి తెచ్చిన నగదును అప్పుగా ఇచ్చారు.


అయితే ఆ మహిళ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో భార్యభర్తలు మనస్తాపానికి గురయ్యారు. కొడుకును ఆస్పత్రికి తీసుకువెళ్తున్నామని చుట్టుపక్కల వారికి చెప్పి భీమవరం వచ్చారు. అక్కడినుంచి మంగళవారం కుముదవల్లిలోని ఓ బిస్కెట్‌ఫ్యాక్టరీ పక్కనే ఉన్న తోటల్లోకి వెళ్లి వెంటతెచ్చుకున్న పురుగుమందు తాగి పసిబాలుడితో సహా మృతిచెందారు. చనిపోవడానికి ముందు వాయిస్‌ మెసేజ్‌ను బంధువులకు పంపించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-01-13T08:34:54+05:30 IST