యానాం ఎన్నికల పరిశీలకురాలికి కరోనా
ABN , First Publish Date - 2021-03-21T09:32:19+05:30 IST
యానాం నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆమెను ఎన్నికల విధులనుంచి తొలగించారు.

యానాం, మార్చి 20: యానాం నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆమెను ఎన్నికల విధులనుంచి తొలగించారు. ఆమె స్థానంలో మరొకరిని నియమిస్తామని యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమన్‌శర్మ తెలిపారు. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శానిటైజేషన్ చేస్తున్నామని, కరోనా సోకిన అధికారి వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.