కొత్తగా 5,646 కేసులు

ABN , First Publish Date - 2021-06-21T09:23:50+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,00,001 శాంపిల్స్‌ను పరీక్షించగా 5,646 మందికి పాజిటివ్‌గా వచ్చిందని, కరోనాతో మరో 50 మంది..

కొత్తగా 5,646 కేసులు

కరోనాతో 50 మంది మృతి


అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,00,001 శాంపిల్స్‌ను పరీక్షించగా 5,646 మందికి పాజిటివ్‌గా వచ్చిందని, కరోనాతో మరో 50 మంది మృతిచెందారని వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18,50,563కి, మొత్తం మరణాల సంఖ్య 12,319కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1,098 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 890, పశ్చిమగోదావరిలో 761, కృష్ణాలో 441, శ్రీకాకుళంలో 396, ప్రకాశంలో 387, అనంతపురంలో 386, గుంటూరులో 309, కడపలో 307 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 17,75,176కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Updated Date - 2021-06-21T09:23:50+05:30 IST