తాడిపత్రిలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-03-22T15:38:19+05:30 IST

జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా

తాడిపత్రిలో విజృంభిస్తున్న కరోనా

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో మాస్కులు ధరించని వారిపై రూ.500 జరిమానాను మున్సిపల్ అధికారులు విధిస్తున్నారు.  
గతంలో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో 29 మంది కరోనా బారినపడిన విషయం తెలిసిందే. వీరిలో ఒకే కాలనీకి చెందిన 16 మంది ఉన్నారు. ఇటీవల స్థానిక, మున్సిపల్ జరుగడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.  ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. 

Updated Date - 2021-03-22T15:38:19+05:30 IST