ఏపీలో కొత్తగా 22,610 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-20T23:11:54+05:30 IST
ఏపీలో కరోనాతో పాటు మరణాలు కూడ ఉధృతంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా రాష్ట్రంలో కొత్తగా

అమరావతి: ఏపీలో కరోనాతో పాటు మరణాలు కూడ ఉధృతంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 114 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 2,09,134 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనా నుంచి 23,098 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,01,281 కరోనా పరీక్షలు చేశారు.
వైరస్ పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించింది. కొన్ని మారుమూల మండలాల్లోనూ రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతంలో కొవిడ్ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అయినా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.