మరో 332 కేసులు.. 6 మరణాలు

ABN , First Publish Date - 2021-10-19T08:13:34+05:30 IST

రాష్ట్రంలో మరో 332 కరోనా కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌ కారణంగా గత 24 గంటల్లో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల

మరో 332 కేసులు.. 6 మరణాలు

రాష్ట్రంలో మరో 332 కరోనా కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌ కారణంగా గత 24 గంటల్లో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,60,804కి, మరణాల సంఖ్య 14,313కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. తాజాగా చిత్తూరు జిల్లాలో 74, కడపలో 51, గుంటూరులో 50, నెల్లూరులో 39, కృష్ణాలో 32, తూర్పుగోదావరిలో 28 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 651 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీలు 20,40,782కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,709 యాక్టివ్‌ కేసులున్నాయి.

Updated Date - 2021-10-19T08:13:34+05:30 IST