రాష్ట్రంలో ‘రాజ్యాంగ బద్ధ’ రాజకీయ క్రీడ!

ABN , First Publish Date - 2021-01-13T08:07:21+05:30 IST

రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ‘రాజ్యాంగ బద్ధ’ రాజకీయ క్రీడ!

ఎన్నికలు నిర్వహించలేమన్నా.. నోటిఫికేషనా: తమ్మినేని


శ్రీకాకుళం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విపత్తులు, వ్యాధి తీవ్రత వంటివి ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయా లు తీసుకోవాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి తెలియదా అని పరోక్షంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్‌ చెబితే.. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏం టని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌ వెనుక ఉండి నడిపిస్తున్న దుష్టశక్తులెవరో అందరికీ తెలియాలన్నారు. కరోనా లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ ఇస్తే.. ప్రభుత్వం గౌరవించిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ పనుల్లో ప్రభుత్వం బిజీగా ఉంటే, ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. 

Updated Date - 2021-01-13T08:07:21+05:30 IST