ఎస్ఎస్‌బీఎన్ కళాశాల గవర్నింగ్ సభ్యుల మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2021-11-10T00:18:12+05:30 IST

నగరంలోని ఎస్ఎస్‌బీఎన్ కళాశాల గవర్నింగ్ సభ్యుల మధ్య

ఎస్ఎస్‌బీఎన్ కళాశాల గవర్నింగ్ సభ్యుల మధ్య విభేదాలు

అనంతపురం: నగరంలోని ఎస్ఎస్‌బీఎన్ కళాశాల గవర్నింగ్ సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సెక్రటరీ, కరస్పాండెంట్‌ తీరుపై కౌన్సిల్ సభ్యుడు విఠల్ మండిపడ్డారు. దీంతో సమావేశం నుంచి సెక్రటరీ, కరస్పాండెంట్‌  అర్ధాంతరంగా వెళ్లిపోయారు. రెండేళ్లుగా గవర్నింగ్ సమావేశం జరగలేదని విఠల్ తెలిపారు. ఎయిడెడ్‌ను ప్రైవేట్‌గా మార్చే అంశంపై సభ్యులకు సమాచారం లేదన్నారు. గవర్నింగ్ కౌన్సిల్‌కు సమాచారమివ్వకుండా చాలా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో బినామీ టెండర్లతో యాజమాన్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆధీనంలో విద్యాసంస్థ నడిస్తే బాగుంటుందని విఠల్‌ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-10T00:18:12+05:30 IST