వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-02-27T00:24:03+05:30 IST

జిల్లాలోని వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు: జిల్లాలోని  వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏకంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అవుకు మండలంలోని చనుగొండ్లలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలోని  వైసీపీలో ఉన్న రెండు వర్గాలు తీవ్ర స్థాయిలో కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు వర్గాలకు చెందిన వైసీపీ శ్రేణులు పోటీలో నిలబడ్డాయి. చల్లా వర్గీయులు తమపై దాడి చేశారని కాటసాని వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-02-27T00:24:03+05:30 IST