గుంటూరు సీఐ శ్రీనివాసరావుపై ఎంపీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-29T02:57:18+05:30 IST

సీఐ శ్రీనివాసరావుపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైస్‌ మిల్లులో షేర్‌ ఇస్తానంటూ సీఐ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ...

గుంటూరు సీఐ శ్రీనివాసరావుపై ఎంపీకి ఫిర్యాదు

గుంటూరు: సీఐ శ్రీనివాసరావుపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైస్‌ మిల్లులో షేర్‌ ఇస్తానంటూ సీఐ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ బాధితుల ఆరోపించారు. రైస్‌మిల్లు పేరుతో సీఐ శ్రీనివాసరావు రూ.10 కోట్లు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే సీఐ బెదిరిస్తున్నాడంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఎంపీని బాధితులు వేడుకున్నారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-29T02:57:18+05:30 IST