ఎన్‌వోసీలపై కమిటీ.. దేవదాయశాఖ ఆదేశాలు

ABN , First Publish Date - 2021-10-21T11:12:57+05:30 IST

దేవుడి భూముల విషయంలో ఇష్టానుసారం నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేయకుండా దేవదాయశాఖ ఓ కమిటీని నియమించింది.

ఎన్‌వోసీలపై కమిటీ.. దేవదాయశాఖ ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దేవుడి భూముల విషయంలో ఇష్టానుసారం నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేయకుండా దేవదాయశాఖ ఓ కమిటీని నియమించింది. ఎన్‌వోసీ దరఖాస్తుల పరిశీలన, సిఫారసుల కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. అదనపు కమిషనర్‌ లేదా జాయింట్‌ కమిషనర్‌ ఎస్టేట్స్‌, న్యాయ సలహాదారు, భూముల విభాగం రూటింగ్‌ అధికారి, ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ తదితరులు ఈ కమిటీలో ఉంటారని తెలిపింది. ఇకపై ఈ కమిటీ ద్వారానే ఎన్‌వోసీలు జారీ కావాలనే ఉద్దేశంతో దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-10-21T11:12:57+05:30 IST