పనులేవీ ఆగకూడదు.. అధికారులకు జగన్ ఆదేశాలు
ABN , First Publish Date - 2021-05-05T23:08:28+05:30 IST
పనులేవీ ఆగకూడదు.. అధికారులకు జగన్ ఆదేశాలు

అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’పై సీఎం జగన్ సమీక్షించారు. జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఈ సమీక్షలో జగన్ చర్చించారు. జగనన్న కాలనీల్లో జూన్ 1న పనులు ప్రారంభించాలని అధికారులకు జగన్ సూచించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ పనులేవీ ఆగకూడదని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగాలన్నారు. నీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అని జగన్ తెలిపారు. ‘‘కార్మికులకు పని దొరుకుతుంది. స్టీల్, సిమెంట్, ఇతర మెటేరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్ అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థనే. నీటి పైప్‌లు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్లన్నీ భూగర్భంలోనే. డీపీఆర్ సిద్ధం చేయండి. పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వండి.’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.