జగన్ రెడ్డి.. బాదుడే బాదుడు: లోకేశ్ సెటైర్

ABN , First Publish Date - 2021-02-26T17:06:24+05:30 IST

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. బాదుడే బాదుడు అంటూ పన్నులతో జగన్ రెడ్డి..

జగన్ రెడ్డి.. బాదుడే బాదుడు: లోకేశ్ సెటైర్

అమరావతి: మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ శుక్రవారం విడుదల చేసింది. మేనిఫెస్టోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. బాదుడే బాదుడు అంటూ పన్నులతో జగన్ రెడ్డి.. జనం నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, రూ.200 వచ్చేది రూ.1000 వచ్చిందని, వెయ్యి వచ్చేది... ఏడెమినిది వేలు వస్తోందని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, పెట్రోలు, డిజిల్ ధరలు సెంచరీకి చేరువలోకి వచ్చాయన్నారు. చెత్త ఎత్తడానికి కూడా పన్ను వేస్తున్నారని, రేషన్ సరుకుల ధరలు పెంచారని మండిపడ్డారు. కుడి చేతి నుంచి పది రూపాయలు ఇచ్చి... ఎడమ చేతి నుంచి వంద లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మేము ఇచ్చాము.. పొడిచామని చెప్పుకుంటుంటారని సెటైర్ వేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు పదివేల మందిని సర్వే చేశామని, ప్రజలు ఆశిస్తున్నదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. 


మూతపడిన అన్నా క్యాంటీన్లు తెరుస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెడతామన్నారు.  పాత పన్ను మాఫీ... ఇకపై హాఫ్ ఉంటుందని ప్రకటించారు. ‘శుభ్రమైన ఊరు.. శుద్ధమైన నీరు’ అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. 

Updated Date - 2021-02-26T17:06:24+05:30 IST