ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-12-21T19:13:41+05:30 IST
ఓటీఎస్ పథకాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు.

ఏలూరు: ఓటీఎస్ పథకాన్ని సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ..ఓటీఎస్ ద్వారా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 31 లక్షల ఇళ్ల స్థలాల విలువ రూ.26 వేల కోట్లు ఉందన్నారు. 16. 60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించామన్నారు.26 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు.ఈ రోజు నుంచి 8.26 లక్షల మందికి ఓటీయస్ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.సంపూర్ణ గృహహక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఓటీయస్ ద్వారా ఉచితంగా ఇళ్లను రిజిష్టర్ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నామన్నారు.మహిళలకు రూ.5 నుంచి 10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు తెలిపారు. పేదలకు సర్వ హక్కులు కల్పించేందుకే.. జగనన్న గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.