సిమ్లా చేరుకున్న సీఎం జగన్‌, కుటుంబం

ABN , First Publish Date - 2021-08-27T09:18:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో గురువారం సిమ్లాకు చేరుకున్నారు. చండీగఢ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారు..

సిమ్లా చేరుకున్న సీఎం జగన్‌, కుటుంబం

అమరావతి, ఆగస్టు 26(ఆగస్టు): ముఖ్యమంత్రి జగన్‌ తన కుటుంబ సభ్యులతో గురువారం సిమ్లాకు చేరుకున్నారు. చండీగఢ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారు, అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో సిమ్లా చేరుకున్నారు. 28న తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జగన్‌ సిమ్లాలో జరుపుకుంటారు. తిరిగి 31న తాడేపల్లి చేరుకుంటారు. ముందుగా లండన్‌, పారిస్‌ వెళ్లాలని అనుకున్నారని, అయితే కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిమ్లా వెళ్లాలని నిర్ణయించుకున్నారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-08-27T09:18:10+05:30 IST