ఉధృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి: సీఎం జగన్
ABN , First Publish Date - 2021-03-24T21:10:05+05:30 IST
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్లాన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం అధికారులతో సమీక్ష జరిపారు.

అమరావతి: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్లాన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉధృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలని సూచించారు. నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నారు. ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. రూరల్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు.