క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
ABN , First Publish Date - 2021-12-26T08:27:36+05:30 IST
క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్

సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థన కూటమి
నూతన క్యాలెండరు ఆవిష్కరణ.. చర్చి న్యూ కాంప్లెక్స్ ప్రారంభం
ముగిసిన మూడు రోజుల కడప జిల్లా పర్యటన
కడప, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం కడప జిల్లా పులివెందుల సీఎ్‌సఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థన కూటమిలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గురువారం కడపకు చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, పులివెందుల నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించారు. చివరి రోజు శనివారం తల్లి విజయలక్ష్మి, సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలసి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రార్థనా కూటమిలో పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. తనయుడు సీఎం జగన్‌కు విజయలక్ష్మి కేక్ తినిపించారు. నుదుటిపై ముద్దుపెట్టి ఆశీర్వదించారు. అనంతరం 2022 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. సీఎ్‌సఐ చర్చి నూతన కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేశ్‌యాదవ్, కల్పలత, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కలెక్టరు విజయరామరాజు, జేసీ ఎం.గౌతమి తదితరులు పాల్గొన్నారు.