సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టుకు ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-06-23T02:10:51+05:30 IST

సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టుకు ఫిర్యాదులు

సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ.. హైకోర్టుకు ఫిర్యాదులు

అమరావతి: సీఎం జగన్‌పై గతంలో నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణపై హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని 11 కేసుల్లో ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంది. అయితే ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసులను చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకున్నారని హైకోర్టుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టనుంది. సుమోటోగా తీసుకున్న అంశంపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వానికి, కేసుల్లోని మిగతా వారికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-06-23T02:10:51+05:30 IST