నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు: జగన్

ABN , First Publish Date - 2021-07-08T21:50:39+05:30 IST

నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు: జగన్

నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు: జగన్

అమరావతి: తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం జగన్‌ అన్నారు. తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని గుర్తుచేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావన్నారు. శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు ఎన్నిరోజులు ఉంది? అని సీఎం ప్రశ్నించారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో తానెప్పుడూ వేలు పెట్టలేదన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

Updated Date - 2021-07-08T21:50:39+05:30 IST